జూలై 13 నుంచి శని గ్రహం తిరోగమనం చేయనుంది. దాదాపు ఈ సారి శ్రావణ మాసం మొత్తం శని వ్యతిరేక దిశలనే ప్రయాణిస్తాడు. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, అందులో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాశులకు మాత్రం చెడు ఫలితాలు కలిగిస్తుంది. కాగా, ఏ రాశుల వారికి శని తిరోగమనం ఆర్థికపరమైన నష్టాలు తీసుకొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు జూలై మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి శని తిరోగమనం చెడు ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా, ఉద్యోగం చేసే వద్ద కూడా వీరు సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. అందుకే కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా మెదలాలి. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అప్పులు కూడా పెరిగే ప్రమాదం ఎక్కువ ఉన్నదంట.
ధనస్సు రాశి : శని వ్యతి రేక దశలో తిరగడం వలన ధనస్సు రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా శ్రావణ మాసం వస్తూ వస్తూనే, ఈ రాశి వారికి నష్టాలు తీసుకురావచ్చు. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి దిగజారవచ్చు. ఉద్యోగాల్లో సవాళ్లు, పని ఒత్తిడి అధికంగా ఉండొచ్చు.
Shani Thirogamanam5
కన్యా రాశి : కన్యారాశి వారికి శ్రావణ మాసం కాస్త కష్టాలతో సాగుతుందనే చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశుల వారు ఏ పని చేసినా కలిసి రాదు. ఆర్థిక సమస్యలతో సతమతం కావాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది.