శత్రుదేశాలకు వణుకు పుట్టించేలా బిగ్ డీల్.. ఏకంగా 114 రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు!

శత్రుదేశాలకు వణుకు పుట్టించేలా బిగ్ డీల్.. ఏకంగా 114 రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు!


శత్రుదేశాలకు వణుకు పుట్టించేలా బిగ్ డీల్.. ఏకంగా 114 రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు!

ఈ డీల్‌కు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ త్వరలోనే ఆమోదం తెలపనుంది. ఈ ఒప్పందం పూర్తయితే యుద్ధ విమానాల కోసం మన దేశం చేసుకున్న అతి పెద్ద డీల్‌ ఇదే అవుతుంది. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే ఒప్పందంపై సంతకాలు జరగడానికి అవకాశం ఉంది. 114 రఫేల్‌ విమానాల్లో 88 సింగిల్‌ సీట్‌ ఫైటర్లు, 26 ట్విన్‌ సీట్‌ శిక్షణ విమానాలు ఉంటాయి. ఈ విమానాలన్నీ పూర్తిగా ఎయిర్స్‌ఫోర్స్‌ కోసం మాత్రమే ఉద్దేశించినవి. 2016లో ప్రధాని మోదీ-హోలెండే మధ్య 36 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ఒప్పందం జరిగింది. ఇప్పుడు 114 కొత్త వాటితో కలిసి మొత్తం మన ఎయిర్‌ఫోర్స్‌లో రఫేల్‌ బలం 150కి పెరగనుంది.

ఇక నేవీకి సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో రూ.63 వేల కోట్లతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్ల కోసం 26 రఫేల్‌-M జెట్‌ సరఫరా చేయాల్సి ఉంది. 2031 నుంచి వీటి రాక ప్రారంభవుతుంది. ఈ రెండు ఒప్పందాలతో భారత్‌ 176 రఫేల్‌ ఫైటర్లను తన ఎయిర్‌ డిఫెన్స్‌కు జోడించనుంది. కొత్త డీల్‌లో భాగంగా 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారవుతాయి. మిగతా 96 దేశీయంగా తయారు చేస్తారు. వీటి సరఫరా 2030 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఒప్పందంలో దేశీయంగా ఉత్పత్తి చేయడమే కీలకం. విమానాల తుది అసెంబ్లింగ్‌ నాగ్‌పూర్‌లోని దసో రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌లో, ముఖ్యమైన భాగాలు, ఫ్యూస్‌లేజ్‌ సెక్షన్‌, రెక్కలు హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌లో తయారుకానున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో ప్రత్యేకంగా ఎంఆర్‌వోను దసో ఏవియేషన్‌ స్థాపిస్తుంది.

అంతేకాదు ఆపరేషన్‌ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన స్కాల్ప్‌ క్షిపణుల డీల్‌పైనా భారత్‌, ఫ్రాన్స్‌ సంతకాలు చేయనున్నాయి. రూ. 3,200 కోట్లతో ఈ లాంగ్‌ రేంజ్‌, స్టెల్త్‌ క్రూయిజ్‌ మిసైళ్లను కొనుగోలు చేయనుంది. రఫేల్‌ విమానాల ద్వారా వీటిని ప్రయోగించవచ్చు. వీటి కొనుగోలు ప్రతిపాదనకు త్వరలో ఢిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ – డీఏసీ ఆమోదం తెలపనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *