వ్యూస్‌ కోసం డెవిల్‌ క్రాబ్‌ తిని మృత్యువాత

వ్యూస్‌ కోసం డెవిల్‌ క్రాబ్‌ తిని మృత్యువాత


వ్యూస్‌ కోసం డెవిల్‌ క్రాబ్‌ తిని మృత్యువాత

ఫిలిప్పీన్స్‌లో ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎమ్మా అమిట్‌ తన స్నేహితులతో కలిసి మడ అడవులకు వెళ్లింది. అక్కడ చిత్రీకరించిన వీడియోలో నత్తలను పీతలను పడుతూ సరదాగా గడిపింది. ఆ తర్వాత కుత కుత ఉడుకుతున్న కొబ్బరిపాలలో ఓ పీతను వేసి వండింది. రుచిని ఆస్వాదిస్తూ తానొక్కతే తింటూ ఎమ్మా వీడియో చిత్రీకరించి ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ కూడా చేసింది. అయితే హఠాత్తుగా ఆ మరుసటి రోజు ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. స్పృహ కోల్పోయి, పెదవులు ముదురు నీలం రంగులోకి మారాయి. స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 6న ఎమ్మా మృతిచెందింది. అధికారుల దర్యాప్తులో ఆమె విషపూరిత పీత ‘డెవిల్‌ క్రాబ్‌’ ను తిన్నట్టుగా తేలింది. ఆ పీతలను ‘టాక్సిక్‌ రీఫ్‌ క్రాబ్స్‌’ అని కూడా అంటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *