భక్తిభావం వెల్లివిరియగా, మంగళవాయిద్యాల నడుమ అమలాపురం గాంధీనగర్‌లో వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారి 30వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ ఉత్సవంలో వేలాదిమంది మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారే సమర్పించారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో కనువిందుగా సాగింది. మహిళలందరూ ఒకేచోట చేరి పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, పిండివంటలు మరియు పట్టుచీరలతో కూడిన సారే పళ్లేలను తలపైనెత్తుకొని ఊరేగింపుగా తరలివచ్చారు. గారపాటివారి వీధి, మహిపాలవీధి మీదుగా సాగిన ఈ యాత్రతో గాంధీనగర్ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయ అర్చకులు రామేశ్వరవరపు రామప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు సమర్పించిన సారేను అమ్మవారికి నివేదించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు సౌభాగ్యానికి చిహ్నమైన గాజులను పంపిణీ చేశారు. ఉత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ అన్నసమారాధనలో వేలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.భక్తుల కోలాహలం, అమ్మవారి నామస్మరణతో అమలాపురం పట్టణం మార్మోగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు
ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా
ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. ఆత్మహత్యా ?? లేక హత్యా ??
పాక్ కు షాకిచ్చిన ట్రంప్ టీమ్ పీఓకేతో భారత మ్యాప్ సిద్ధం
పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి