ఏంటి ఈ నైట్ టూరిజం? పగటిపూట రద్దీ, ట్రాఫిక్, ఎండ వేడిమి నుంచి దూరంగా.. ప్రశాంతమైన వాతావరణంలో చారిత్రక కట్టడాలను, ప్రకృతి అందాలను చూడటమే ఈ నైట్ టూరిజం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం మన దేశంలో ఈ ట్రెండ్ ఒక హీలింగ్ ఎక్స్పీరియన్స్ గా మారుతోంది.
పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రధాన అంశాలు: చారిత్రక కట్టడాల వెలుగులు..ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని ఎర్రకోట వంటి కట్టడాలు రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.స్టార్ గేజింగ్..కాలుష్యానికి దూరంగా నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూడటం కోసం లడఖ్, జైసల్మేర్ వంటి ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
నైట్ సఫారీ..అడవిలోని జంతువుల జీవనశైలిని రాత్రివేళ గమనించేందుకు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నైట్ సఫారీలు అందుబాటులోకి వచ్చాయి.వారణాసి గంగా హారతి: రాత్రివేళ గంగా నది తీరాన జరిగే హారతి ఇచ్చే ఆధ్యాత్మిక అనుభూతి వర్ణనాతీతం. పగటిపూట.పగటిపూట ఉండే కోలాహలం రాత్రివేళ ఉండదు. ఇది పర్యాటకులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వేసవి కాలంలో పగటి ఎండల కంటే రాత్రిపూట చల్లని వాతావరణంలో తిరగడం సౌకర్యవంతంగా ఉంటుంది. వెన్నెల వెలుగుల్లో లేదా లైటింగ్ మధ్య చారిత్రక కట్టడాలను ఫోటోలు తీసుకోవడం పర్యాటకులకు క్రేజీగా మారింది.
భారత పర్యాటక శాఖ కూడా నైట్ టూరిజంను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రధాన నగరాల్లోని మ్యూజియంలు, స్మారక చిహ్నాలను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచడం, కట్టుదిట్టమైన భద్రత కల్పించడం వంటి చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతోంది.
బిజీ లైఫ్ నుంచి బ్రేక్ కావాలనుకునే వారికి, ప్రకృతి ఒడిలో కాసేపు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి నైట్ టూరిజం ఒక అద్భుతమైన ఆప్షన్. అందుకే ఇప్పుడు భారత్ నైట్ టూరిజం గమ్యస్థానంగా మారుతోంది.




