
జ్యోతిషశాస్త్రంలో లోహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి లోహం ఒక గ్రహానికి అనుగుణంగా ఉంటుందని నమ్మతారు, కాబట్టి సరైన లోహాన్ని ధరిస్తే ఆ గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయని, అశుభ ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే ఉంగరాలు, కంకణాలు, తాయెత్తులు, పూజా వస్తువులలో ప్రత్యేక లోహాలను ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రంలో వెండి చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. వెండి చంద్ర గ్రహానికి సంబంధించినది. అందుకే వెండి మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఈ రోజు మనం ఏ రాశుల వారు వెండి బ్రాస్లెట్ ధరించడం శుభప్రదం, ఏ రాశుల వారు వెండి బ్రాస్లెట్ ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి – మానసిక శాంతి, ఆనందానికి మూలం
జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండి చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంది. చంద్రుడు మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యతకు చిహ్నం, శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, అందానికి ప్రతీక. కాబట్టి, వెండి కంకణాలు ధరించడం సానుకూల ఫలితాలను ఇస్తుందని నమ్మతారు.
ఏ రాశులకు వెండి శుభకరంగా ఉంటుంది?
కర్కాటకం, వృశ్చికం, మీనం.. ఈ మూడు రాశులవారి కోసం వెండి ప్రత్యేకంగా లాభదాయకమని నమ్మతారు. ఈ రాశులు నీటి మూలకానికి చెందినవిగా ఉంటాయి. వెండి కూడా నీటి మూలకానికి చెందినదని చెప్పబడుతుంది. అందువల్ల, ఈ రాశులవారి కోసం వెండి కంకణాలు శుభప్రదంగా పరిగణించబడతాయి.
ఏ రాశులవారు వెండి ధరిస్తే జాగ్రత్త?
మేషం, సింహ, ధనుస్సు ఈ మూడు రాశులవారు వెండి లేదా వెండి కంకణాలు ధరిస్తే, మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు రావచ్చని జ్యోతిషశాస్త్రం సూచిస్తుంది.
ఎప్పుడు, ఏ చేతికి ధరించాలి?
సోమవారం, శుక్రవారం అత్యంత శుభదినాలుగా పరిగణించబడతాయి.
పురుషులు: కుడి చేతికి
మహిళలు: ఎడమ చేతికి
జ్యోతిషశాస్త్రం ప్రకారం సరైన రాశికి సరైన లోహం ధరించడం అనేది సానుకూల ఫలితాలను ఇస్తుంది. తప్పుగా ధరించడం ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు, కాబట్టి వెండి కంకణం లేదా ఇతర వెండి ఆభరణాలను ధరిస్తే ముందు జ్యోతిష్కుని సంప్రదించడం అత్యంత ముఖ్యం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)