
డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వశోధన శక్తి స్థిరంగా కొనసాగుతుందన్న సిద్ధాంతం ఇప్పటిదాకా ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా తెలిపారు. డార్క్ ఎనర్జీ పై పరిశోధన జరిపిన రెండు అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకా తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు తెలియజేశారు. 2000 కోట్ల సంవత్సరాల తర్వాత విశ్వం వృద్ధి చెందటం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుందని అది అంతిమంగా అంతమైపోతుందని అంటున్నారు. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తి పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో ఒక బిందువుగా మారుతుందట. ఇదే గనుక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే గనుక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పనిసరి భావించాల్సి ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. విశ్వం మొత్తం ఆయుషు 330 కోట్ల ఏళ్ళని తాజా సిద్ధాంతం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1380 కోట్ల ఏళ్లు గడిచాయి. ఈ లెక్కన దాని ఆయుష్షు ప్రమాణం సగం ముగిసినట్లే. అయితే మరిన్ని ఖచ్చితమైన పరిశోధనలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా ఖచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాలి ఉందని అంటున్నారు.