విదేశీ టూరిస్టులపై సామూహిక అత్యాచారం.. ఆ ముగ్గురికి ఉరి శిక్ష విధించిన కర్నాటక కోర్టు

విదేశీ టూరిస్టులపై సామూహిక అత్యాచారం.. ఆ ముగ్గురికి ఉరి శిక్ష విధించిన కర్నాటక కోర్టు


బెంగళూరు, ఫిబ్రవరి 16: కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో జరిగిన విదేశీ టూరిస్టుల హత్యాచారం కేసులో కర్నాటక సెషన్‌ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఉరి శిక్ష విధించింది. ఈ మేరకు సోమవారం (ఫిబ్రవరి 16) కొప్పల్ జిల్లా గంగావతిలోని జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ దుర్మార్గులు ఇజ్రాయిల్ మహిళా టూరిస్ట్‌, ఆమె ఫ్రెండ్‌పై సామూహిక అత్యాచారంతోపాటు మరో విదేశీయుడ్ని కూడా చంపారు. అనంతరం వాళ్ల దగ్గరున్న వస్తువులను కూడా దోపిడీ చేశారు. నిందితులు మల్లేష్, చైతన్య సాయి, శరణప్పను ఫిబ్రవరి 6న దోషులుగా తేల్చిన కోర్టు ఈ రోజు ముగ్గురికీ మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే..

2025 మార్చి 6 (గురువారం)న కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి, అమెరికాకు చెందిన ఓ యువకుడు, నాసిక్‌ చెందిన పంకజ్‌, ఒడిశాకు చెందిన బిబాస్‌ పర్యటనకు వచ్చారు. వీరు హంపి సమీపంలో అంబికా నాయక్‌ హోంస్టేలో బస చేశారు. అదే రోజు రాత్రి సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్దతుంగభద్ర కాలువ వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో కొందరు దుండగులు వచ్చి తొలుత వారిని పెట్రోల్‌ ఎక్కడ దొరుకుతుందని అడిగారు. ఈ నెపంతో మాట కలిపి రూ.100 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పర్యాటకులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దుండగులు వారిపై దాడి చేసి పంకజ్, బిబాస్, డేనియల్‌ను పక్కనే ఉన్న కాలువలోకి తోసేశారు. అనంతరం అక్కడున్న విదేశీ మహిళ, మరో భారతీయ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాలువలో పడిన వారిలో పంకజ్, డేనియల్‌ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్‌ మాత్రం నీటి ఉద్ధృతికి గల్లంతయ్యాడు.

ఈ కేసులో నిందితులు మల్లేష్ అలియాస్ హండి మల్లేష్, సాయి, శరణప్ప లకు మరణశిక్షను విధిస్తున్నారు. కోర్టు గత వారం నిందితులను దోషులుగా నిర్ధారించిన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక తీర్పును గత వారం రిజర్వ్‌ చేశారు. సోమవారం అంతిమ తీర్పు వెలువరిస్తూ ఇది అరుదైన ఘటనగా కోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా ఘటన జరిగిన 11 నెలల్లోనే తీర్పు వెలువరించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *