బ్యాగేజ్ రూల్స్ 2026 ప్రకారం ఆభరణాలపై పాత విలువ పరిమితిని రద్దు చేశారు. బదులుగా బరువు ఆధారిత మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. విదేశాల నుంచి బంగారు ఆభరణాలను తీసుకువచ్చేటప్పుడు దాని ధర విషయంలో ఎయిర్‌పోర్టుల్లో పలు సమస్యలు తలెత్తేవి. తాజాగా మారిన నిబంధనలతో ధరకు బదులుగా బరువు ఆధారంగా పరిగణనలోకి తీసుకునే వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రయాణీకుల ఆధారంగా వేర్వేరు డ్యూటీ-ఫ్రీ అలవెన్స్ పరిమితులను నిర్ణయించింది. నివాసితులు, భారత సంతతికి చెందిన పర్యాటకులు, చెల్లుబాటు అయ్యే నాన్-టూరిస్ట్ వీసా కలిగి ఉన్న విదేశీయులు రూ. 75,000 వరకు డ్యూటీ-ఫ్రీ వస్తువులను తీసుకురావడానికి అనుమతి ఉంటుంది. గతంలో ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉండేంది. విదేశీ సంతతికి చెందిన పర్యాటకులు ఎటువంటి డ్యూటీ చెల్లించకుండా రూ. 25 వేల వరకు విలువైన వస్తువులను తీసుకెళ్లవచ్చు. సిబ్బందికి డ్యూటీ-ఫ్రీ అలవెన్స్ పరిమితి రూ. 2,500గా ఉంది.
కొత్త నిబంధనల ప్రకారం ఒక భారతీయుడు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉండి రాకపోకల సమయంలో ఆభరణాలను తీసుకువస్తుంటే బరువు ఆధారంగా సుంకం రహిత భత్యం ఉంటుంది. మహిళా ప్రయాణీకులు 40 గ్రాముల వరకు నగలను డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. ఇతర ప్రయాణీకులు 20 గ్రాముల నగలను డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. గతంలో అవి ఖరీదైన నగలు అయితే తక్కువ బరువు ఉన్నప్పటికీ సుంకం భారీగా ఉండేది. ఈ కొత్త వ్యవస్థ ప్రయాణీకుడికి, కస్టమ్స్ అధికారికి ఇద్దరికీ సరళంగా పారదర్శకంగా ఉంటుంది. ఆభరణాల బరువుకు సంబంధించి వివాదాలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ మినహాయింపు వ్యక్తిగత ఆభరణాలకే పరిమితం అవుతుంది.
ఎవరైనా బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాలను ఏ రూపంలోనైనా విలువైన లోహాలను తీసుకువస్తుంటే వారికి సుంకం ఉండదు. కస్టమ్స్ వద్ద దానిని వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం కనీసం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుంచి నిర్ణీత బరువు కంటే ఎక్కువ బరువున్న ఆభరణాలను తీసుకువచ్చే భారతీయులు అదనపు ఆభరణాలపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఆభరణాలకు సంబంధించి ఈ కొత్త నియమ మార్పుల ఉద్దేశ్యం ఆభరణాల పరిమితిని పెంచడం కాదు. ఆభరణాలను తీసుకువచ్చే ప్రక్రియను సులభతరం చేయడం.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.