ఇంటి పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఏ ఇల్లు అయితే చెత్త చెదారంతో నిండి పోతుందో, అలాంటి ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. కానీ కొందరి ఇళ్లు చాలా నీట్గా ఉన్న పేదరికం తప్పదు. అయితే దీనికి ముఖ్య కారణం శుభ్రపరిచే విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించకపోవడమే అంటున్నారు కొందరు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని క్లీన్ చేసే విషయంలో కూడా కొన్ని వాస్తు టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, చీపురు ఎప్పుడు అందరికీ కనిపించే విధంగా, ఇంటికి ఎదురుగా ఉండకూడదంట. చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి దానిని గౌరవమైన ప్రదేశంలో ఉంచాలంట,ముఖ్యంగా చీపురును బహిరంగంగా పెట్టడం వలన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంట. వాస్తు ప్రకారం ఇది అస్సలే మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
మన పెద్ద వారు ఎక్కువగా చెబుతుంటారు. సాయంత్ర సూర్యస్తమయం తర్వాత అస్సలే చీపిరితో ఊడ్చకూడదు అని చెబుతుంటారు. దీని వలన లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. దీని వలన ఆర్థిక సమ్యలు దరి చేరుతాయి. పేదరికం వస్తుందని చెబుతుంటారు. అయితే ఇళ్లు ఎంత నీటుగా ఉన్నా, సాయంత్ర వేళ ఇంటిని శుభ్రం చేయడం వలన కూడా ఆర్థిక సమస్యలు పెరుగుతాయంట.
కొంత మంది తెలిసి తెలియక, అలాగే, పొరపాటున చీపురును కాళ్లతో తాకుతుంటారు. కాగా, వాస్తు ప్రకారం ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయంట.
ఇంటిని శుభ్రపరిచిన తర్వాత ఆ నీరు తప్పు దిశలో ప్రవహించకూడదంట. ముఖ్యంగా దక్షిణం వైపుగా ఇంటిని తుడిచిన నీరు ప్రవహించడం మంచిది కాదంట. దీని వలన ఆ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు, నష్టాలు వస్తాయంట. అంతే కాకుండా ఎప్పుడూ పేదరికం ఉంటుందంట.