Headlines

వామ్మో.. తులం బంగారం రూ.4.5 లక్షలు..! భయపెడుతున్న నోస్ట్రాడమస్ అంచనాలు.. ఏం చెప్పాడంటే..?

వామ్మో.. తులం బంగారం రూ.4.5 లక్షలు..! భయపెడుతున్న నోస్ట్రాడమస్ అంచనాలు.. ఏం చెప్పాడంటే..?


ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య విలువైన బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా 2026 సంవత్సరం నాటికి బంగారం, వెండి, రాగి ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయని అటు ఆర్థిక నిపుణులు, ఇటు చారిత్రక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే శతాబ్దాల క్రితమే వింతైన అంచనాలు వేసిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ అంచనాలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. నోస్ట్రాడమస్ తన రచనల్లో నేరుగా బంగారం ధరల గురించి చెప్పకపోయినప్పటికీ, ప్రపంచవ్యాప్త ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ పడిపోవడం, సామాజిక అశాంతి గురించి ప్రస్తావించారు. ఆధునిక విశ్లేషకులు దీనిని ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులతో పోలుస్తున్నారు. సంపదను కాపాడుకోవడానికి ప్రజలు మళ్లీ బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారని ఆయన అంచనాల సారాంశం.

బంగారం ధరలు ఇలా

ముఖ్యంగా 2026 నాటికి బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయని అంచనా. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలను పెంచుకోవడం, ద్రవ్యోల్బణ భయాలు ఇందుకు ప్రధాన కారణం. ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారం.. 2026లో బంగారం ధర ఔన్సుకు 4,700డాలర్ల నుండి 5,400 డాలర్లకు వరకు పెరగవచ్చు. అంటే భారతీయ కరెన్సీలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.3.9 లక్షల నుండి రూ.4.5 లక్షల వరకు పలికే అవకాశం ఉంది. జెపి మోర్గాన్ వంటి దిగ్గజ బ్యాంకులు కూడా ఇవే సంకేతాలు ఇస్తున్నాయి.

వెండి ధరలు

మరోవైపు వెండి ధరలు కూడా పారిశ్రామిక అవసరాల రీత్యా ఆకాశాన్ని తాకనున్నాయి. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి పాత్ర కీలకం కావడంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. 2026 నాటికి వెండి ఔన్సుకు 120 డాలర్లకి చేరుకోవచ్చని, అంటే 10 గ్రాముల ధర సుమారు రూ.6,000 నుండి రూ.10,000 వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేవలం బంగారం, వెండి మాత్రమే కాకుండా రెడ్ మెటల్‌గా పిలవబడే రాగి కూడా రేసులో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాగి ఎంతో అవసరం. సరఫరా కొరత కారణంగా 2026 నాటికి రాగి ధర టన్నుకు 12,500 డాలర్లు అంటే కిలోకు దాదాపు రూ.1,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త వృద్ధికి రాగి ధర ఒక సూచికగా నిలుస్తుంది.

మొత్తానికి, నోస్ట్రాడమస్ రహస్య అంచనాలు, ఆధునిక ఆర్థిక విశ్లేషణలు రెండూ 2026ను ఒక కీలకమైన ఆర్థిక సంవత్సరంగా చూపిస్తున్నాయి. బంగారం, వెండి మరియు రాగి రాబోయే రోజుల్లో అత్యంత విలువైన ఆస్తులుగా నిలవనున్నాయి. అయితే మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా పెట్టుబడిదారులు నిపుణుల సలహా తీసుకోవడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *