వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్‌ ఏదో తెలుసా?

వామ్మో.. ఒక్క రాత్రి గడిపేందుకు రూ.26 లక్షలా? అంత లగ్జరీ ప్లేస్‌ ఏదో తెలుసా?


సాధారణంగా ఎంత పెద్ద లగ్జరీ హోటలైనా ఒక రాత్రి ఉండేందుకు ఛార్జ్‌ చేసేది ఒకటి రెండు లక్షలు ఉండొచ్చు. అయితే తాజాగా ఓ లగ్జరీ సూపర్‌యాచ్‌కు సంబంధించిన ధరలు వైరల్‌గా మారాయి. అక్కడ ఒక్క రాత్రి గడిపేందుకు ఏకంగా రూ.26 లక్షలు చెల్లించాలి. అమన్ గ్రూప్ తన కొత్త ప్రాజెక్ట్ అమన్ ఎట్ సీ ఆవిష్కరించింది. దీని ధరలు సంపన్న ప్రయాణికులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి.

జనవరి 21న బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే సందడి మొదలైంది. ఈ అల్ట్రా-లగ్జరీ క్రూయిజ్ కోసం ప్రారంభ ప్యాకేజీ ఐదు రాత్రులకు 38,500 డాలర్లు (ఒక రాత్రికి సుమారు 7,700 డాలర్ల) నుండి ప్రారంభమవుతుంది. 4,000 చదరపు అడుగుల సూపర్-ప్రీమియం సూట్‌లు రాత్రికి 29,000 డాలర్లు (సుమారు రూ.26 లక్షలు) వరకు చెల్లించాలి. ఈ సూట్‌లలో ప్రైవేట్ వర్ల్‌పూల్. ప్రైవేట్ లిఫ్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

2027లో ఈ యాచ్‌ మధ్యధరా మార్గాల్లో ప్రయాణించి, ప్రతి ప్రయాణానికి 94 మంది అతిథులకు మాత్రమే వసతి కల్పిస్తుంది. 700 మిలియన్ డాలర్ల విలువైన ఈ సూపర్‌యాచ్‌లో రెండు హెలిప్యాడ్‌లు, స్పాలో IV థెరపీ, వ్యక్తిగత అసిస్టెంట్‌, సూట్‌లో రోజువారీ అల్పాహారం ఉంటాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లేదా మొనాకో గ్రాండ్ ప్రిక్స్ వంటి ఈవెంట్‌లకు కూడా VIP పాస్‌లను అందిస్తుంది. అయితే చాలా మంది ట్రావెల్ ఏజెంట్లు, కస్టమర్లు ఈ ధర విషయంలో సంకోచిస్తున్నారు. పైగా ఇందులో వైన్, రెస్టారెంట్ ఖర్చులు ప్యాకేజీలో చేర్చలేదు. అయినప్పటికీ అమన్ గ్రూప్ CEO వ్లాడిస్లావ్ డోరోనిన్ ధరలను సమర్ధించుకున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *