వామ్మో.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

వామ్మో.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది.. ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న వారు మన దగ్గర కోకొల్లలు. అయితే అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు. తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ కొంతమంది దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ కిడ్స్ చాలా మంది గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన వారే.. కొంతమంది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే మరికొంతమంది ఒకటిరెండు సినిమాల్లో మెరిశారు. అలాగే పైన కనిపిస్తున్న అమ్మడు కూడా.. పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ ను గుర్తుపట్టారా.? అంత సులభం కాదులెండి. ఆమె అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతుంది ఆ స్టార్ కిడ్. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సాధించి వందకోట్లకు పైగా రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

పై ఫొటోలో రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న చిన్నారి ఎవరో కనిపెట్టరా.? ఆ ఫోటో రాంబంటు సినిమాలోది ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ ఐశ్వర్య రాజేష్. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. తెలుగుఅమ్మాయే అయినా తమిళ్ లో ఈ చిన్నది కెరీర్ మొదలు పెట్టింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఆతర్వాత వరల్డ్ ఫెమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తాజాగా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ భార్యగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఐశ్వర్య తన నటనతో ఆకట్టుకుంది. భాగ్యం పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు వందకోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. అలాగే ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *