వామ్మో.. ఆహారంలో ఇది ఎక్కువైతే ముప్పును కొని తెచ్చుకున్నట్లే.. డైరెక్టుగా మీ గుండెకే ఎసరుపెడుతుంది..

వామ్మో.. ఆహారంలో ఇది ఎక్కువైతే ముప్పును కొని తెచ్చుకున్నట్లే.. డైరెక్టుగా మీ గుండెకే ఎసరుపెడుతుంది..


బిర్యానీ అయినా.. పప్పు అయినా, కూర అయినా, చట్నీ అయినా.. ఇలా ప్రతీ వంటకాల్లోనూ ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అప్పుడే లొట్టలేసుకుంటూ తింటుంటాం.. ముఖ్యంగా.. ఉప్పు లేకుండా ఆహారం రుచి అసంపూర్ణమని భావిస్తాం.. కూర మొదలుకుని.. స్నాక్స్ వరకూ ప్రతిదానిలోనూ ఉప్పు అవసరం. కానీ మీ ఆహారానికి రుచినిచ్చే ఉప్పు కూడా మీ ఆరోగ్యానికి ప్రమాదకరం.. అని మీకు తెలుసా..? అవును ఉప్పు అధికంగా తీసుకుంటే, అది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఉప్పును మోతాదుకు మించి వాడుతుంటారని.. ఇది ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొంటున్నారు.

అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుందని, ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు ప్రధాన కారణమని వైద్యులు వివరిస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకునే ఈ చిన్న అలవాటు ఎలా ప్రమాదానికి కారణమవుతుందో వివరంగా తెలుసుకుందాం.

అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది..

ఉప్పులో ఉండే సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండెను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది.. ఇలా క్రమంగా గుండె పనితీరును బలహీనపరుస్తుంది. ఈ పరిస్థితి గుండెపోటు లేదా గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

గుండెకు మంచిది కాదు..

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ధమనుల గోడలు గట్టిపడతాయి. ధమనులు వాటి వశ్యతను (కుంచించుకుపోవడం) కోల్పోయినప్పుడు, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ (ధమనులు ఇరుకుగా మారడం) అంటారు.. ఇది గుండెపోటుకు ప్రధాన కారణం.

ఉప్పు పట్ల జాగ్రత్త వహించండి

చాలా మంది తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తింటామని అనుకుంటారు. కానీ ఉప్పు టేబుల్ మీద ఉన్న సాల్ట్ షేకర్ నుండి మాత్రమే రాదు.. అది ప్రాసెస్ చేసిన ఆహారం, బిస్కెట్లు, నమ్కీన్, ఇన్‌స్టంట్ నూడుల్స్, పాపడ్, ఊరగాయలు, కెచప్‌లలో దాగి ఉంటుంది. ఈ ‘దాచిన ఉప్పు’ వనరుల కారణంగా మన రోజువారీ సోడియం తీసుకోవడం చాలా పెరుగుతుంది.

ఉప్పు అధిక వినియోగాన్ని ఎలా నియంత్రించాలి?

ఆహారంలో అధికంగా ఉప్పు వేసే అలవాటు మానేయండి.

ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి

ఉడికించిన పండ్లు – కూరగాయల తీసుకోవడం పెంచండి.

ఆహార పదార్థాల లేబుల్‌లను చదవండి. తక్కువ సోడియం ఎంపికలను ఎంచుకోండి.

ఇంట్లో తక్కువ సోడియం ఉప్పు లేదా రాతి ఉప్పును వాడండి.

రుచికి కొద్దిగా ఉప్పు అవసరం, కానీ ఎటువంటి జాగ్రత్త లేకుండా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యానికి ప్రాణాంతకం కావచ్చు. ఈ రోజు ఒక చిన్న మార్పు రేపు మీ ప్రాణాలను కాపాడుతుంది.. పెద్ద వ్యాధుల ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుంది.. కాబట్టి, ఇప్పటి నుంచి ఉప్పును మితంగా జాగ్రత్తగా తీసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *