మలబద్ధకం: శరీరంలో తగిన నీటి స్థాయులు లేకుంటే మలబద్ధకం వంటి సమస్యలు ఎదరవుతాయి. దీనికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పైల్స్ వంటి వ్యాధులు తలెత్తుతాయి. వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి
ఎనర్జీ లెవెల్స్: మనం ఉత్సాహంగా పనిచేయాలంటే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ఎంతో అవసరం. ఇందుకోసం క్రమం తప్పకుండా నీటిని తీసుకుంటూ ఉండాలి. లేకపోతే చిన్న పనికి కూడా త్వరగా అలసిపోతారు.
కిడ్నీ సమస్యలు: మూత్రపిండాలు మన శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తాయి. అయితే శరీరంలో నీటి కొరత కిడ్నీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ విషయం తెలియక చాలామంది తక్కువ నీరు తాగుతూ కిడ్నీ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో నీటి స్థాయులు తగినంతగా లేకపోతే చర్మం మెరుపును కోల్పోతుంది. ముఖం అందవిహీనంగా కనపడుతుంది. దీంతో పాటు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా మొదలవుతాయి. తగినంత నీరు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అదేవిధంగా పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్లు: శరీరంలో తక్కువ నీటి స్థాయులు ఉండడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. ఏ కాలమైన కూడా నీరు ఎక్కువగా తీసుకోవాలిని నిపుణులు చెబుతున్నారు.