వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో

వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో


మీ ఫోన్ సిగ్నల్ సరిగా లేకుంటే, ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి 10-15 సెకన్ల తర్వాత.. మళ్లీ ఆన్‌ చేయండి. ఇది మీ ఫోన్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రీసెట్ చేస్తుంది. ఈ సాధారణ ట్రిక్ తరచుగా తక్షణ సిగ్నల్ మెరుగుదలకు సహకరిస్తుంది. మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి. కొన్నిసార్లు ఫోన్ 4G లేదా 5Gకి ఆటోమేటిక్‌గా మారడానికి బదులుగా 2G లేదా 3Gలో నిలిచిపోయి ఉండవచ్చు. సెట్టింగ్‌లకు వెళ్లి మొబైల్ నెట్‌వర్క్ ఆప్షన్ క్లిక్ చేసి 4G లేదా 5Gని సెలెక్ట్ చేసుకోండి. ఇది సిగ్నల్ ను మెరుగుపరుస్తుంది. అయిప్పటికీ బలహీనంగా ఉంటే ఫోన్ నెట్‌వర్క్ మోడ్‌ని ఆటోమేటిక్‌ మోడ్‌కి సెట్ చేయండి. తద్వారా మీ ఫోన్ అందుబాటులో ఉన్న ఉత్తమ సిగ్నల్‌కు కనెక్ట్ అవుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌ సెలక్ట్‌ చేయాలి. ఆ తర్వాత నెట్‌వర్క్ ఆపరేటర్లకు వెళ్లి సెర్చ్ నెట్‌వర్క్‌ ఎంచుకోండి. అప్పుడు మీరు బలమైన టవర్ లేదా నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా ఎంచుకోవచ్చు. ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పటికీ Wi-Fi అందుబాటులో ఉంటే Wi-Fi కాలింగ్ యూజ్ చేయండి. దీని కోసం సెట్టింగ్‌లలో Wi-Fi కాలింగ్ ఆప్షన్ ఆన్ చేయండి. మొబైల్ సిగ్నల్ లేకపోయినా మీరు Wi-Fi ద్వారా కాల్స్ చేయవచ్చు. ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం :

నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో .. వైరల్ అవుతున్న వీడియో

ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో

రేయ్ ఎంత పని చేసార్రా.. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెనా? వీడియో

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *