ఈ సంగతి ఆ నోటా ఈ నోటా బయటకు రావటంతో.. ఎక్కడెక్కడి నుంచో జనం.. ఆ నగల కోసం ఆ షాపు ఉన్న ప్రాంతంలోని వీధులన్నీ జల్లెడ పట్టటం మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజూలాగే జులై 25న షాంగ్జీ ప్రావిన్స్‌లోని కౌంటీలో లావోఫెంగ్జియాంగ్ అనే నగల షాపును సిబ్బంది తెరిచారు.అయితే, అతి భారీ వర్షం కురవటంతో ఎగువ నుంచి షాపులోకి వరదనీరు చొచ్చుకొని వచ్చింది. దీంతో.. కళ్లముందే షాపులోని నగలు, సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయాయి. రూ. 12 కోట్ల విలువైన 20 కిలోల బంగారం, భారీగా నగదు గల్లంతైనట్లు యజమాని తెలిపారు. ఇక, ఈ సంగతి తెలుసుకుని.. స్థానికులు పెద్దఎత్తున వీధుల్లోకి చేరి వెతుకులాట ప్రారంభించారు. వారిలో కొందరు తమకు దొరికిన నగలను షాపు ఓనర్‌కి ఇచ్చారు. అలా ఇప్పటికి కిలో బంగారం తమకు చేరిందని షాపు యజమాని వెల్లడించారు. అయితే.. రోజులు గడుస్తున్నా ఇంకా చాలామంది ఆ వీధుల్లోనే తిరుగుతూ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం వాటి తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
9 గంటలకు పైగా నిద్రపోతే.. చావు మూడినట్లేనా?
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన
కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే
Sania Mirza: అతనితో రొమాన్స్ కి రెడీ అంటున్న సానియా మీర్జా
రీల్స్ పిచ్చి తో హత్యలు కూడా చేస్తున్నారా ?? చివరికి తోడబుట్టిన అక్కని కూడా!