లివర్ చెడిపోతే శరీరం చూపే ముఖ్యమైన వార్నింగ్స్ ఇవే..! అస్సలు లైట్ తీసుకోకండి..!

లివర్ చెడిపోతే శరీరం చూపే ముఖ్యమైన వార్నింగ్స్ ఇవే..! అస్సలు లైట్ తీసుకోకండి..!


లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇది మన కాలేయం పై నెమ్మదిగా ప్రభావం చూపిస్తూ.. ప్రాణాలకు ప్రమాదం కలిగించే స్థాయికి చేరుకోవచ్చు. ఎక్కువగా ఆల్కహాల్, సిగరెట్లు వాడటం, అధిక బరువు, కొన్ని రకాల మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యలు, హెపటైటిస్ బి, సి వైరస్‌లు కూడా దీనికి కారణం కావచ్చు. లివర్ క్యాన్సర్ మొదట్లో కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడం

ఏ డైట్ చేయకుండానే బరువు తగ్గుతున్నారా..? అయితే ఇది మొదటి వార్నింగ్ కావచ్చు. అంతేకాకుండా.. తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తే అది కూడా లివర్ సమస్యలకు సంకేతమే.

కడుపులో నొప్పి

పొత్తికడుపులో నొప్పి, వాపు లేదా కడుపులో నీరు చేరినట్లు అనిపిస్తే.. అది లివర్ సమస్యలకు గుర్తు కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

పసుపు రంగులో కళ్లు

కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం (పచ్చ కామెర్లు) లివర్ ఆరోగ్యాన్ని సూచించే ముఖ్యమైన లక్షణం. ఇది చాలా సీరియస్ వార్నింగ్.

చర్మంపై దురద

కారణం లేకుండా చర్మం దురదగా అనిపించడం, తీవ్రంగా గీతలు పడటం కూడా లివర్‌ కు సంబంధించిన సమస్యల గుర్తు కావచ్చు.

మూత్రం రంగులో మార్పు

మామూలు కంటే ముదురు గోధుమ రంగులో మూత్రం కనిపించడం. లివర్ సమస్యలకు సంకేతం కావచ్చు.

అలసట

ఏ పని చేయకపోయినా బలహీనంగా అనిపించడం కూడా లివర్ క్యాన్సర్‌ కు సంబంధించిన లక్షణాల్లో ఒకటి. మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీరే సొంతంగా ఏదో ఒక నిర్ణయానికి రాకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *