లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్‌.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు

లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్‌.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు


ముంబయిలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గోరెగావ్‌ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో జరిగిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్థానిక అపార్ట్‌మెంట్‌లో జరగనున్న ఒక వేడుక కోసం రాజ్‌కుమార్ మహతో అనే వ్యక్తి గ్యాస్ బెలూన్లను డెలివరీ చేసేందుకు వచ్చాడు. అతను బెలూన్లతో సహా లిఫ్ట్‌లోకి ఎక్కగా, అదే సమయంలో ఓ వైద్య విద్యార్థినితో పాటు మరో యువకుడు కూడా లిఫ్ట్‌ ఎక్కారు. అయితే లిఫ్ట్ కదలక ముందే, గ్యాస్‌తో నిండిన బెలూన్లు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. సెకన్ల వ్యవధిలోనే లిఫ్ట్ అంతా మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగగానే అప్రమత్తమైన ముగ్గురూ ప్రాణభయంతో వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్ మహతో మరియు హిమానీకి గాయాలయ్యాయి. గ్యాస్ బెలూన్ల నుంచి వెలువడిన వేడి, మంటల కారణంగా వారు గాయపడినట్లు సమాచారం. తృటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బెలూన్ల దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. యజమాని సూచనల మేరకే ఈ డెలివరీ జరుగుతున్నందున, భద్రతా ప్రమాణాలు పాటించలేదనే కారణంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: అర్చకులకు టీటీడీ శిక్షణ ప్రారంభం

ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన’ఇరాన్’

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *