లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. కోట్లకొద్దీ ఆస్తులు ఉన్నా సింపుల్‌గా ఇలా

లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. కోట్లకొద్దీ ఆస్తులు ఉన్నా సింపుల్‌గా ఇలా


చాలా మంది సెలబ్రెటీలు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఖరీదైన కార్లు, లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తుంటారు. లక్షల ఖరీదైన  బట్టలు, కోట్లు ఖరీదైన కార్లు వాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంత ఆస్తిపాస్తులు ఉన్న కూడా సింపుల్ లైఫ్ ను గడుపుతుంటారు. అలాగే కొంతమందికి కార్ల పిచ్చి ఎక్కువ ఉంటుంది. చాలా బ్రాండెడ్ కార్లు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎంత కాస్ట్లీ కార్లు ఉన్న కూడా అప్పుడప్పుడు ఆటోల్లో తిరుగుతూ ఉంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా ఇలా ఆటోలో తిరుగుతూ కనిపించింది. ఆమె ఎవరో తెలుసా.? ఆమెను కనిపెట్టరా.? ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ ఆమె. ఆమె మరెవరో కాదు అందాల భామ అలియా భట్‌. ఈ అమ్మడికి  వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా ఆటోలో ప్రయాణించింది ఈ అందాల భామ. ఇటీవల ఓ సాయంత్రం ముంబైలో అలియా భట్ ఆటో తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని డ్రామా అని, మరికొందరు అలియా భట్‌కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ తన సింప్లిసిటీని చూపించేందుకే ఆటోలో ప్రయాణించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం వేరు. అలియా వెళ్లాల్సిన దారి చాలా ఇరుకుగా ఉంది. కాబట్టి, అంత చిన్న రోడ్డులో పెద్ద కార్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఆమె ఆటోలో ప్రయాణించారని అభిమానులు అంటున్నారు. అలియా భట్‌తో పాటు ఆమె బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. అలియాను చూసిన పాపరాజీ ఫోటోలు, వీడియోల కోసం ఆమెను అనుసరించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *