లగేజ్‌ బ్యాగ్‌తో బస్సు ఎక్కిన యువతి.. ఉన్నట్లుండి బ్యాగ్‌లో కదలికలు! ఓపెన్‌ చేసి చూడగా…

లగేజ్‌ బ్యాగ్‌తో బస్సు ఎక్కిన యువతి.. ఉన్నట్లుండి బ్యాగ్‌లో కదలికలు! ఓపెన్‌ చేసి చూడగా…


ఓ మహిళ లగేజ్‌ బ్యాగ్‌తో బస్సు ఎక్కింది. తోటి ప్రయాణికులతో కులాసాగా మాట్లాడుతున్న సదరు మహిళ బ్యాగ్‌ ఎందుకో అప్పుడప్పుడు కదలసాగింది. అనుమానం వచ్చిన బస్సు డ్రైవర్‌ ఆమె వద్దకు వచ్చి బ్యాగ్‌ ఓపెన్‌ చేయమన్నాడు. అంతే ఆమెలో కంగారు మొదలైంది. దీంతో బస్సులోని తోటి ప్రయాణికులకు అనుమానం బలపడింది. వెంటనే బ్యాగ్‌ ఓపెన్‌ చేయగా.. అందులో బతికున్న రెండేళ్ల చిన్నారి కనిపించింది. ఈ షాకింగ్‌ ఘటన న్యూజిలాండ్‌లో ఆదివారం (ఆగస్టు 3) వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు ఉత్తరాన 60 మైళ్ల దూరంలో ఉన్న కైవాకాలోని ఒక బస్ డిపోకు బస్సు డ్రైవర్ ఫోన్ చేశాడు. తన బస్సులోని ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌ అప్పుడప్పుడు కదులుతుందని వారికి ఫోన్‌లో తెలియజేశాడు. అనంతరం బస్సు డ్రైవర్‌ మహిళ వద్దకు వచ్చి లగేజ్‌ బ్యాగ్‌ తెరవమని డిమాండ్‌ చేయడంతో.. ఆమె చేసేదిలేక దాన్ని తెరచింది. ఆశ్చర్యంగా అందులో రెండేళ్ల చిన్నారి కనిపించింది. దీంతో చిన్నారిని బయటకు తీసి, ఒళ్లు వేడిగా ఉన్నట్లు గమనించి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహిళను పోలీసులకు అప్పగించారు.

లగేజీ కంపార్ట్‌మెంట్‌లో సదరు మహిళ రెండేళ్ల చిన్నారిని దాచిన బ్యాగ్‌ను ఉంచినట్లు DI సైమన్ హారిసన్ తెలిపారు. అరెస్ట్‌ చేసిన మహిళను (27) సోమవారం (ఆగస్టు 4) మధ్యాహ్నం నార్త్ షోర్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆ మహిళ వాంగెరై నుంచి ఆక్లాండ్‌కు బస్సులో ప్రయాణిస్తుండగా బస్సు స్టోవేవేలో మూసి ఉన్న సూట్‌కేస్‌లో చిన్నారిని ఉంచినట్లు కోర్టు పత్రాల్లో ఆరోపణలు నమోదు చేశారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన న్యూజిలాండ్‌ మంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది. అయితే చిన్నారి పట్ల ఇంత నిర్లక్ష్యం వహించిన నిందితురాలు చిన్నారికి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *