దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. నదీముఖద్వారంలోని చేపల వేలం కేంద్రంలో ఈ చేపలు రూ.33 లక్షల ధరకు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలోని ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల తీవ్రమైన వ్యాధుల మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా సౌందర్య సాధనాల తయారీలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సంఘటన ఆ జాలరి జీవితానికి కీలక మలుపు తీసుకొచ్చింది. నానీ గోపాల్ ఇక తన కుటుంబానికి ఎటువంటి ఢోకా లేదని చెబుతున్నాడు. ఈ ఘటన స్థానిక మత్స్యకారులలో ఆశలు రగిలించింది. ఆ గంగమ్మ ఆశీస్సులు తమకు కూడా దక్కాలని వారు కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మబాబోయ్.. బాత్‌రూంలో భారీ కోబ్రా
హ్యాకర్ల చేతుల్లోకి ఏకంగా 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు
ఎవరో ఆ లక్కీ మ్యాన్.. రూ. 2 వేల కోట్ల లాటరీ కొట్టేసాడు
పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం