ముందుగా మసాలా తయారీ కి కావాల్సిన పదార్థాలు : మెంతులు, తురిమిన ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క , ధనియాలు, కసూరి మేథి, పసుపు, ఇంగువ చిటికెడు, గసగసాలు, తెల్ల నువ్వులు , స్టార్ పువ్వు, చెక్క.
తయారీ విధానంలోకి వెళితే .. స్టవ్ ఆన్ చేసి, వీటన్నిటినీ మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని, చల్లారిన తర్వాత రోటీలో వేసి రుబ్బుకోవాలి. ఈ పొడిని మరో బౌల్లోకి తీసుకొని, అందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ మసాలా రెడీ.
చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు : చేపలు కేజీ, కారం, ఉప్పు, పుసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, నూనె, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్.
తయారీ : ముందుగా చేపలను నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆర బెట్టాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని, వాటికి కారం, ఉప్పు, నిమ్మరసం, మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి, అల్లం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పెద్ద కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత వాటిలో మనం కలిపి పెట్టుకున్న చేపల ముక్కలను వేసి, లో ఫ్లేమ్‌లో మంచిగా కాలే వరకు వేయించుకోవాలి. కనీసం 6 నిమిషాలు వేయిస్తే లోపల ముక్క ఉడికి టేస్ట్ కూడా బాగుటుంది.తర్వాత ఈ చేపలను ఒక గిన్నెలోకి తీసుకొని, వాటిపై నూనెలో వేయించిన కరివేపాకురెబ్బలు, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా లైట్‌గా చల్లాలి. అంతే వేడి వేడి చేపల ఫ్రై రెడీ. తింటే నోరూరిపోద్దీ.




