రోజూ తినే అన్నంతో ఆరోగ్యానికి ముప్పా..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

రోజూ తినే అన్నంతో ఆరోగ్యానికి ముప్పా..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు..!


రోజూ తినే అన్నంతో ఆరోగ్యానికి ముప్పా..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

గ్లోబల్ వైద్య జర్నల్‌ లో వచ్చిన అధ్యయన వివరాల ప్రకారం.. 2050 నాటికి ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో ప్రధానంగా తినే అన్నం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశముందని తేలింది. వీటిలో భారత్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ పరిశోధన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించారు.

తాజా సమాచారం ప్రకారం.. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల నేలలోని మూలకాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్సెనిక్ అనే విషపదార్థం స్థాయి పెరుగుతోందని అధ్యయనంలో తేలింది. ఈ ఆర్సెనిక్ అన్నంలోకి చాలా సులభంగా చేరుతుంది. మట్టిలో ఉండే ఆర్సెనిక్, సాగునీటిలో ఉన్న ఆర్సెనిక్ వలన వరి ధాన్యంలో ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది. వండే సమయంలో ఉపయోగించే నీటిలో ఆర్సెనిక్ ఉంటే అది కూడా అన్నంలోకి చేరే అవకాశం ఉంటుంది.

మన శరీరంలో ఆర్సెనిక్ చేరితే ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయం, చర్మం లాంటి అవయవాలలో క్యాన్సర్ ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా.. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందుగా మట్టి నీటి నాణ్యతపై కఠిన నియంత్రణ అవసరం. అలాగే వరి సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలి. ప్రాంతాల వారీగా పర్యావరణ పరిరక్షణ, శుద్ధి విధానాలు పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్షపు నీటి వాడకం, పదార్థాల శుద్ధి, ఆరోగ్యదాయక వంట నీటి వినియోగం లాంటి అంశాలపై గ్రామ స్థాయిలో అవగాహన పెరగాలి.

అన్నం మన జీవితంలో విడదీయరాని భాగం. అయితే మారుతున్న వాతావరణం అన్నంపై చూపే ప్రభావం మన ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్నం పండించడంలో, శుద్ధి చేయడంలో, వాడటంలో మార్పులు తీసుకురావడం చాలా అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *