దీంట్లో పెట్టుబడి పెడితే ప్రస్తుతం 7.9 వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో.. ఏడాదికి కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రతి నెలా రూ. 12,500 అంటే రోజుకు దాదాపు రూ. 411 కడితే.. ఒక ఏడాదిలో మొత్తం రూ. 1.5 లక్షలు జమ అవుతాయి. 15 ఏళ్ల తర్వాత దాదాపు రూ. 43.60 లక్షలు పొందవచ్చు. దీంట్లో దాదాపు రూ. 21 లక్షలు వడ్డీ రూపంలో అందుతాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే.. దీనికి పన్ను ఉండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. పీపీఎఫ్‌పై వడ్డీ రేటు కూడా బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. దీనిలో డబ్బు డిపాజిట్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు కోరుకుంటే మొత్తం డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు. లేదా నెలవారీగా కట్టొచ్చు. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి ఐదేళ్లలో రుణం తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పీపీఎఫ్‌లో ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేసే సౌకర్యాన్ని కూడా పోస్టాఫీసు అందుబాటులోకి తెచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా డాక్ పే యాప్ సహాయంతో మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పీపీఎఫ్ ఖాతాకు ఈజీగా డబ్బును బదిలీ చేయవచ్చు. దీని కోసం.. IPPB అకౌంట్‌ను మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. తర్వాత యాప్‌లో పీపీఎఫ్ ఆప్షన్‌ను ఎంచుకుని.. అకౌంట్ నంబర్, కస్టమర్ ఐడీని నమోదు చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మయసభ రివ్యూ.. పొలిటికల్ డ్రామా ఎలా ఉందంటే?