రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం

రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం


‘మిర్చి సిటీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుంటూరు జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టి ‘ఎల్లో మిర్చి’ సాగుపై పడింది. సాధారణంగా ఘాటైన ఎర్ర మిర్చికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ ప్రాంతంలో, ఓవైపు చీడపీడలు మరోవైపు పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయంగా ఈ పసుపు రంగు మిర్చి వైపు మొగ్గు చూపుతున్నారు. రెడ్‌ మిర్చి కంటే ఎల్లో మిర్చి అధిక దిగుబడితోపాటు గిట్టుబాటు ధర కూడా పలుకుతుండటంతో రైతులు పసుపు మిర్చి సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎర్ర మిర్చి ఎకరానికి 15 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుండగా, ఎల్లో మిర్చి ఏకంగా 25 నుండి 30 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తోంది. ధర విషయంలోనూ ఇది రికార్డులు సృష్టిస్తోంది. సాధారణ మిర్చి ధర క్వింటాకు రూ. 10 వేల నుండి ప్రారంభమైతే, ఎల్లో మిర్చి ప్రారంభ ధర రూ. 25 వేల నుండి 30 వేల వరకు పలుకుతోంది. గతంలో ఈ రకం గరిష్టంగా క్వింటాకు రూ. 50 వేల ధర పలికిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఒక్క గుంటూరు జిల్లాలోనే వెయ్యి ఎకరాలకు పైగా ఎల్లో మిర్చి సాగు చేయడం విశేషం. ముఖ్యంగా మేడికొండూరు మండలంలోని మందపాడు, విశదల, సిరిపురం గ్రామాల్లో రైతులు ఈ పంటను అత్యధికంగా వేశారు. సాగు ఖర్చు ఎకరానికి రూ. 10 వేల వరకు అదనంగా ఉన్నప్పటికీ, చీడపీడల బెడద తక్కువగా ఉండటం, అధిక లాభాలు వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర మిర్చి కంటే పది క్వింటాళ్ల అదనపు దిగుబడి వస్తుండటంతో, రానున్న రోజుల్లో ఈ సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తమకు మరింత మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *