
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం వేతనాలు పెంచాలని.. వేతనాలు పెంచితేనే షూటింగ్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. వేతనాలు పెండింగ్ పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇతర భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఇది వర్తిస్తుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.