నిజామాబాద్‌లోని సీతరాంనగర్ కాలనీలో నివసించే రవికుమార్, అమూల్య దంపతుల కుమారుడు రెంజర్లవార్ వియాన్ఈ ఘనతను సాధించాడు. వియాన్ తండ్రి రవికుమార్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి అమూల్య గృహిణి. ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ మనవడే ఈ వియాన్. వియాన్‌కు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచే తల్లి అమూల్య రాష్ట్రాల రాజధానుల పేర్లను సరదాగా నేర్పించడం ప్రారంభించారు. తల్లి ప్రోత్సాహంతో ఆ బాలుడు అనతికాలంలోనే అన్ని రాష్ట్రాల రాజధానులను గుర్తుపెట్టుకుని, ఎవరు అడిగినా తడుముకోకుండా చెప్పే స్థాయికి చేరుకున్నాడు. ఈ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు మే నెలలో నిజామాబాద్‌కు స్వయంగా వచ్చారు. వియాన్ ప్రతిభను ప్రత్యక్షంగా పరీక్షించి ఆశ్చర్యపోయారు. వారి ఎదుట కేవలం 41 సెకన్లలోనే 29 రాజధానుల పేర్లను బాలుడు చెప్పడంతో వారు రికార్డుకు ఎంపిక చేశారు.
మరిన్నివీడియోల కోసం :
ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్
డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో
చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్