రామ్ చరణ్ వివాదం పై దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారని శిరీష్ రెడ్డి అన్నారు. గేమ్ చేంజెర్ రిలీజ్ టైమ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని రిలీజ్ చెయ్యమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ శిరీష్ రెడ్డి తెలిపారు. అలాంటి వ్యక్తిని నేను కావాలని ఎందుకు అంటాను, మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మెగా హీరోలకు మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది, నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెడితే క్షమించండి, త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాం అని శిరీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆయన గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం తమకు ఫోన్ కూడా చేయలేదన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ శిరీష్ రెడ్డిపై భగ్గుమంటున్నారు. అంతకు ముందు దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే శిరీష్ రెడ్డి సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడు మరోసారి వీడియోతో క్లారిటీ ఇచ్చారు శిరీష్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, అలాగే మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడం. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే… క్షమించండి’ అని సోషల్ మీడియా వేదికగా శిరీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.