రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? అయితే ఇలా చేసి చూడండి.. చిటికెలో నిద్రముంచుకొస్తుంది

రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? అయితే ఇలా చేసి చూడండి.. చిటికెలో నిద్రముంచుకొస్తుంది


చాలా మంది రాత్రి పడుకునే ముందు స్నానం చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది పగటిపూట స్నానం చేసినప్పటికీ రాత్రి పూట కూడా స్నానం చేయడానికి కూడా ఇష్టపడతారు. శీతాకాలంలో ఇలా చేయకపోవచ్చు కానీ వేసవిలో మాత్రం తప్పనిసరిగా వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఖచ్చితంగా ఇలా చేస్తారు. దీని గురించి కాన్పూర్‌లోని లోహియా ఆరోగ్య ఆసుపత్రికి చెందిన డాక్టర్ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మొత్తం రోజంతా అలసటను కూడా చిటికెలో తొలగిస్తుంది. వేసవి కాలంలో స్నానం చేసేటప్పుడు నీరు చాలా వేడిగా ఉండకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనివల్ల మీకు మరింత వేడిగా అనిపించవచ్చు. కాబట్టి వేసవి కాలంలో చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించాలి. రాత్రి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కింద పరిశీలిద్దాం..

అలసట దూరమవుతుంది

రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల రోజంతా ఉన్న అలసట తొలగిపోతుంది. శరీరం రిలాక్స్డ్ స్థితిలోకి వెళుతుంది. రాత్రి స్నానం చేయడం వల్ల రోజంతా శరీరంపై ఉన్న క్రిములు, ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. దీనివల్ల వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

బాగా నిద్రపడుతుంది

నేటి బిజీ జీవనశైలిలో చాలా మందికి తగినంత నిద్ర లేదు. రాత్రిపూట సరైన నిద్ర రాని వ్యక్తులు కొందరు ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. హెల్త్‌లైన్ ప్రకారం రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మానసిక స్థితి బాగుంటుంది

రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాత్రి స్నానం చేయడం వల్ల మీ మానసిక స్థితి బాగుంటుంది. రోజు పని ఒత్తిడి తర్వాత, రాత్రి పడుకునే కొన్ని గంటల ముందు స్నానం చేస్తే, చిరాకు వంటి సమస్యలు తగ్గుతాయి.

చర్మానికి మేలు చేస్తుంది

ముఖం మీద మొటిమలు రావడానికి కారణం రోజంతా చర్మంపై చెమట, ధూళి ఉండటం. అటువంటి పరిస్థితిలో రాత్రి స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. ఇలా చేయడం ద్వారా చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం కూడా ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *