రాత్రిపూట తాగాల్సిన మ్యాజిక్ డ్రింక్.. మానసిక ఒత్తిడి, నిద్రలేమికి ఇక టాటా చెప్పండి..!

రాత్రిపూట తాగాల్సిన మ్యాజిక్ డ్రింక్.. మానసిక ఒత్తిడి, నిద్రలేమికి ఇక టాటా చెప్పండి..!


ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది తరచూ నిద్రలేమి, చిన్నచిన్న జబ్బుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలు వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క, పసుపు కలిపిన పాలు తాగడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాటు.

రోగనిరోధక శక్తి

పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే శక్తిని పెంచుతుంది. దాల్చినచెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇది శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. వీటిని పాలలో కలిపి తాగితే చలికాలపు వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.

మానసిక ఒత్తిడి

రాత్రి నిద్ర రాక ఇబ్బంది పడేవారు ఈ పాలను తాగితే శరీరం రిలాక్స్ అవుతుంది. ఇందులోని సహజ గుణాలు మనసును ప్రశాంతంగా ఉంచి.. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తాయి. ఇది రసాయన నిద్ర మందులకు మంచి ప్రత్యామ్నాయం.

శరీర నొప్పులు

పసుపు పాలు శరీరంలోని వాపులను, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను తగ్గించడంలో ఉపశమనం ఇస్తాయి. దాల్చినచెక్క రక్తప్రసరణను మెరుగుపరిచి ఇతర నొప్పుల నుండి ఉపశమనం కలిగించగలదు. ఇది వృద్ధులు వాడితే ఎంతో ఉపయోగకరం.

జీర్ణవ్యవస్థ

ఈ పాలను తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గే ప్రక్రియకు సహాయపడుతుంది.

తయారు చేయడం ఎలా..?

ఒక గ్లాసు పాలు తీసుకుని బాగా వేడి చేయండి. అందులో అర టీస్పూన్ పసుపు పొడి, ఒక చిటికెడు దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపండి. కావాలనుకుంటే రుచి కోసం ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. బాగా కలిపి కాస్త వేడిగా ఉండగానే తాగండి.

తాగే ముందు జాగ్రత్త

ఇది సాధారణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో దాల్చినచెక్క లేదా పసుపు పాలు శరీరానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, రోగనిరోధక మందులు వాడేవారు ముందుగా వైద్యులను సంప్రదించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *