మంచి ముగింపు.. పాజిటివ్ ప్రారంభం కావాలంటే డిసెంబర్ పర్ఫెక్ట్ గా కుదరాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ అదిరిపోయింది. ఇది కదా.. సీజన్ అంటే.. ఇవి కదా కలెక్షన్లంటే అనిపించింది. మరి ఈ ఏడాది కూడా అదే వైబ్ క్రియేట్ అవుతుందా? లాస్ట్ ఇయర్‌ని గుర్తుచేస్తుందా? డిసెంబర్లో వస్తానని ప్రకటించిన రాజా సాబ్ రిలీజ్ మాటేంటి? చూసేద్దాం ఎక్స్ క్లూజివ్గా…
డిసెంబర్‌ని ఇయర్ ఎండింగ్ అనాలా? నెక్స్ట్ సంక్రాంతికి ఈ డిసెంబరే నాంది అనుకోవాలా? మీరేమైనా అనుకోండి..మాకు మాత్రం థియేటర్ల దగ్గర సందడి తగ్గకుండా చూసుకోండి అంటున్నారు మూవీ లవర్స్. సందడి తగ్గడమనే మాటే ఉండదు.. కావాలంటే ఓ సినిమాను అదనంగా తీసుకొస్తామని అంటోంది ఇండస్ట్రీ. మిగిలిన సినిమాల సంగతి ఓకే.. రాజాసాబ్ మాటేంటి? అని ఆరా తీస్తున్నారు డార్లింగ్ సైనికులు.
ఇప్పటికైతే ముందిచ్చిన మాట మీదే ఉన్నారు మేకర్స్. డిసెంబర్లో కనిపించడం, కలవడం, కలబడటం పక్కా అనే మాట మీదే ఉన్నారు. వీయఫ్ యక్స్ మీద బేస్ అయిన సినిమా కాబట్టి, తరచూ రూమర్లయితే వినిపిస్తున్నాయి. వాటి సంగతి పక్కన పెడితే.. లాస్ట్ ఇయర్ పుష్పను మించే కలెక్షన్లు కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పుష్పతో సందడి మొదలైంది. ఈ ఏడాది ఆ హంగామా సెప్టెంబర్ అక్టోబర్ నుంచే మొదలవుతుంది. సెప్టెంబర్‌లో ఓజీ, అఖండలాంటి మన సినిమాలుంటే, అక్టోబర్ మాత్రం ఎక్కువగా డబ్బింగ్ సినిమాల మీదే డిపెండ్ అయి ఉంది. ప్యాన్ ఇండియా రేంజ్లో క్లిక్ అయిన డివైన్ బ్లాక్ బస్టర్కి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ ఒన్ ల్యాండ్ అయ్యేది అక్టోబర్‌లోనే.
కాంతారతోనూ, తమిళ్ నుంచి వస్తున్న మరికొన్ని డబ్బింగ్ సినిమాలతోనూ, మన కే ర్యాంప్తోనూ అక్టోబర్ ఫిల్ అవుతుంది. ఆ తర్వాత నవంబర్‌లో మాత్రం డేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. చిన్నాచితకా సినిమాలు మమ అనిపించుకోవడానికి రిలీజ్‌కి వస్తే వస్తాయేమోననే అభిప్రాయం అయితే ఉంది ఇప్పటికి. ఆ సైలెన్స్ ని డిసెంబర్ సినిమాల సక్సెస్ సౌండ్ దద్దరిల్లేలా చేయాలన్న మాట గట్టిగానే వినిపిస్తోంది ట్రేడ్ సర్కిల్స్ లో. నెక్స్ట సంక్రాంతికి కొబ్బరికాయ కొట్టేది డిసెంబర్లోనే కదా మరి.. అన్నది వాళ్ల మాట.