రాఖీ పండుగ రోజు ఈ పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి..!

రాఖీ పండుగ రోజు ఈ పూజలు చేస్తే అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతాయి..!


రక్షాబంధన్ పండుగ సోదర, సోదరీమణుల అనుబంధానికి చిహ్నం. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటుంది. ఈ పండుగ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, పనులు చేయడం వల్ల వారి జీవితంలో శుభం జరుగుతుందని నమ్మకం ఉంది. రక్షాబంధన్ రోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంపద కోసం రాఖీ పూజ

రక్షాబంధన్ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజ గదిలో అన్ని రాఖీలను ఒక పళ్లెంలో పెట్టండి. ఆ పళ్లెంలో ఒక వెండి నాణెం లేదా రూపాయి నాణెం ఉంచండి. తర్వాత ఆ రాఖీలను వినాయకుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయ్యాక ఆ నాణేన్ని ఎర్రని బట్టలో చుట్టి మీ డబ్బు పెట్టే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద పెరుగుతుందని చెబుతారు.

అభివృద్ధి కోసం శివ పూజ

జీవితంలో ఎదుగుదల సాధించాలనుకునేవారు రక్షాబంధన్ రోజున శివుడికి అభిషేకం చేయాలి. పంచామృతంతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) శివలింగానికి అభిషేకం చేసి శివుడికి రాఖీ కట్టండి. పూజ చేసేటప్పుడు మనసులో శివ నామాలను జపించండి. ఈ పూజ చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయి.

లక్ష్మీ, వినాయక పూజ

రక్షాబంధన్ రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం కలుగుతాయి. పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి మంత్రం ( ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః )ను 108 సార్లు, వినాయకుడి మంత్రం ( ఓం గణ గణపతయే నమః ) ను 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సమస్యలు తొలగి సంపద పెరుగుతుంది.

కుటుంబ రక్షణ కోసం

కుటుంబానికి రక్షణ ఉండాలని కోరుకునే వారు ఒక శుభ్రమైన పట్టు బట్టలో పసుపు, కుంకుమ, గంధం, బియ్యం, దుర్వ, ఒక రూపాయి నాణెం లేదా చిన్న బంగారు ముక్కను ఉంచి ఎర్రటి లేదా పసుపు రంగు దారంతో కట్టండి. ఈ మూటను మీ ఇంటి పూజ గదిలో లేదా పవిత్రమైన చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల కుటుంబం శాంతిగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంటుందని నమ్ముతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *