నగరంలో ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కేవలం ఎనిమిది రోజుల్లోనే భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో నగరవ్యాప్తంగా 21,713 కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు ఫిబ్రవరి 10 మంగళవారం ప్రకటించారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ వల్ల కేవలం ట్రాఫిక్ జామ్‌లు మాత్రమే కాకుండా, ఎదురుగా వచ్చే వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించే వారిని ఇబ్బందులకు గురిచేస్తూ, రోడ్డుపై గందరగోళం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు నమోదు చేయడమే కాకుండా, వాహనదారుల్లో మార్పు తీసుకురావడానికి పోలీసులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. జంక్షన్ల వద్ద అవగాహన కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్లతోపాటు, ఫేస్బుక్, ఎక్స్ వేదికగా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజా భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాన్ B కాదు.. C, D కూడా రెడీ చేసిన స్టార్స్
Hrithik Roshan: హృతిక్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్
Suriya: సూర్య కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకులు
Rukmini Vasanth: రష్మికను ఫాలో అవుతున్న రుక్మిణీ వసంత్
Toxic: రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న టాక్సిక్