రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం

రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం


రష్యాలోని ఉఫా మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల టీనేజర్‌ కత్తితో హాస్టల్‌లోకి ప్రవేశించాడు. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలు పెట్టాడు. కంటపడిన వారందరినీ పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులకు కత్తిపోట్లు తగిలాయి. దాడి జరిగిన సమయంలో అక్కడ అంతా రక్తసిక్తమైతే.. నిందితుడు బాధితుల రక్తంతో గోడలపై ‘స్వస్తిక్’ చిహ్నాలను గీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యూదుల మారణహోమం గురించి అతడు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసాడు. కొందరు విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు పోలీస్ అధికారులను కత్తితో గాయపరిచాడు. అనంతరం తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగోలా అతడిని నిలువరించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు నిషేధిత నియో-నాజీ సంస్థకు చెందినవాడని రష్యాలోని ప్రముఖ టెలిగ్రామ్ ఛానల్ ‘బాజా’ తెలిపింది. ఈ విషాదకర ఘటనపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కజాన్‌లోని కాన్సులేట్ నుంచి ఉన్నతాధికారులు ఉఫాకు బయలుదేరి వెళ్లినట్లు తెలిపింది. రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. నలుగురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నాం అని ఎంబసీ ప్రకటించింది. రష్యా ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం

కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..

అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్‌ చేయగా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *