మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే


ఎంగేజ్‌మెంట్‌లు పూర్తిచేసుకొని పెళ్లిపీటలెక్కే శుభముహూర్తం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న యువ జంటలకు గుడ్‌ న్యూస్‌. త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని మూడు నెలల నుండి ముహూర్తాలు లేక వేచిచూస్తున్న నవదంపతులకు ఆ శుభసమయం రానే వచ్చేసింది. రెండు నెలల వ్యవధిలో అత్యద్భుతమైన 12 శుభ ముహూర్తాలు నవ జంటలను కలిపేందుకు వచ్చేసాయి. ఇంతకీ ఆ ముహూర్తాలు ఏవో తెలుసా..! మూఢాల కారణంగా శుభ ముహూర్తాలు లేక గత మూడు నెలల నుంచి కళ్యాణ మండపాలు మూగ బోయాయి. పెళ్లి నిశ్చయం చేసుకున్న వారు శుభ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే… ఫిబ్రవరి 19 నుండి ఉగాది వరకు కేవలం 12 మాత్రమే పెళ్లికి దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. వాటిలో ఫిబ్రవరి మాసంలో 19,20,21,22,25,26 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మార్చి నెలలో 5,6,7,8,11,22 తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు వివరిస్తున్నారు. ఉగాది తర్వాత మళ్లీ కొత్త పంచాంగం ఆధారంగా శుభ ముహూర్తాలు నిశ్చయిస్తారు. అయితే మూడు నెలల పాటు వేచి చూసిన నవదంపతులు, పెళ్లిళ్లు నిశ్చయించుకున్న కుటుంబాలు ఇప్పుడు హడావుడిగా పరుగులు పెడుతున్నారు.దీంతో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ హాల్స్, వస్త్ర దుకాణాలు బంగారు దుకాణాలు, కళకళలాడుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో పురోహితులు, బ్యాండ్ నిర్వాహకులు, డెకరేషన్ సిబ్బందికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *