మొహర్రం ఊరిగింపునకు భారీ ఏర్పాట్లు! షియా పెద్దలతో సీపీ ఆనంద్‌ సమావేశం

మొహర్రం ఊరిగింపునకు భారీ ఏర్పాట్లు! షియా పెద్దలతో సీపీ ఆనంద్‌ సమావేశం


శుక్రవారం(జూన్‌ 27) నుంచి మొహరం నెల ప్రారంభం కాబోతుంది.మొహరమ్ అనేది ఇస్లామిక్ సంవత్సరంలోని మొదటి నెల. ఈ నెలలో జరిగే అశూరా (10వ రోజు) ప్రత్యేకమైనది. ఇది ముఖ్యంగా షియా ముస్లింలు జరుపుకునే మతపరమైన ప్రత్యేక రోజు. షియా ముస్లింలు ఇమామ్ హుస్సేన్, అతని అనుచరుల మరణాన్ని స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తారు. అందులో భాగంగానే సంతాప సూచకంగా ఊరేగింపును నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో వేలాది మంది షియా ముస్లింలు పాల్గొంటారు. బిబి కా ఆలం డబ్బిర్పురా నుండి ప్రారంభమై చార్మినార్ హౌస్ పురాని హవేలీ మీదుగా వెళ్తూ చివరగా చాదర్ఘట్ వద్ద ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఊరేగింపునకు హైదరాబాద్‌ పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జూలై 6న జరగనున్న ఊరేగింపుపై సాలార్జంగ్ మ్యూజియంలో షియా కమిటీ మత పెద్దలతో హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ సమావేశం నిర్వహించారు. మొహర్రం ఊరేగింపు ప్రశాంత నిర్వహించడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు ప్రభుత్వ అధికారులు, జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి, వాటర్ వర్క్స్, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొహరం ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టిందని తెలిపారు.

ఊరేగింపు సందర్భంగా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన వాహన వర్కింగ్ సదుపాయాలు కల్పించాలని ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు ఈవ్‌టీజర్లను దూరంగా ఉంచడానికి పోలీస్‌లతో పాటు యాక్షన్ ఫోర్స్ సిటీ క్రైమ్ పోలీసులతో మొహరం ఊరేగింపు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఊరేగింపునకు వచ్చే ఏనుగుకు మంచి విశ్రాంతి లభించేలా రెండు మూడు రోజుల ముందే దానిని తీసుకురావాలని సూచించారు. ఏనుగు దగ్గరకు ఆ సమయంలో ప్రజలు ఎవరూ రాకుండా ఏనుగు చుట్టూ తగిన సురక్షిత స్థలం ఉండేలా చూస్తూ ఊరేగింపు కొనసాగాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *