మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది

మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది


మేడారం మహాజాతర ముగిసినా, అమ్మవార్ల హుండీ లెక్కింపులో భక్తుల వింత కోరికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో 828 హుండీల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 5 వ తేదీ నుండి ప్రారంభమైంది. సుమారు 500 మంది సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో కానుకలను లెక్కిస్తుండగా.. కరెన్సీ కట్టల మధ్య లభ్యమవుతున్న భక్తుల విజ్ఞప్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆస్తి కోసం ఒకరు.. ప్రేమ కోసం మరొకరు.. భక్తులు తమ మనసులోని బాధలను, కోరికలను లేఖల రూపంలో రాసి హుండీలో వేశారు. ఇందులో కొన్ని వింతగా ఉంటే, మరికొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. తల్లిదండ్రుల ఆస్తి శివరాత్రి లోపే నాకు దక్కేలా చూడు తల్లి..అని ఓ భక్తుడు లేఖ రాయగా.. సొంత కొడుకు వేధింపుల నుండి నన్ను కాపాడు తల్లీ అని ఒక తండ్రి 100 రూపాయల నోటుపై తన ఆవేదనను రాసి అమ్మవారికి మొరపెట్టుకున్నాడు. ఇక తమ పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించాలని, అందరూ కలిసి శుభకార్యాలు జరిపించాలని ఓ ప్రేమ జంట వేడుకుంది. కొందరు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యేలా దీవించమని మరికొందరు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కానుకల లెక్కింపులో బిజీగా ఉన్న సిబ్బందికి, ఈ లేఖలు కాసేపు నవ్వును, వినోదాన్ని పంచుతున్నాయి. భక్తులకు దేవతలపై ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ లేఖలే నిదర్శనమని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *