Headlines

మూడేళ్లు పరారీ ముద్దుగుమ్మ.. ఆ హీరోయిన్‌ను అరెస్ట్ చేయమన్న కోర్టు.. కారణం ఏంటంటే..

మూడేళ్లు పరారీ ముద్దుగుమ్మ.. ఆ హీరోయిన్‌ను అరెస్ట్ చేయమన్న కోర్టు.. కారణం ఏంటంటే..


కొంతమంది తమ నటనతో మంచి పేరు తెచ్చుకుంటారు. మరికొంతమంది గ్లామర్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం వివాదాలతో ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటారు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు కొంతమంది హీరోయిన్. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. కొంతమంది తెలిసి తెలియక చేసిన కామెంట్స్ తో విమర్శలు వివాదాలు ఎదుర్కొంటే.. ఇంకొంతమంది మాత్రం కావాలని వివాదాలు సృష్టిస్తూ ఉంటారు. ఓ హీరోయిన్ కూడా చేసిన కామెంట్స్ తో కారణంగా మూడేళ్లు కనిపించకుండా పోయింది. తప్పించుకు తిరుగుతున్న ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు కూడా ఆదేశించింది. దాంతో ఇప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది మీరా మిథున్. తఅలాగే అక్కడ  బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా చర్చలో నిలిచింది. 2021లో, షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకలు, నిర్మాతలను ఉద్దేశించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆమెపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి, ఫలితంగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆతర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

మీరా మిథున్‌కు సంబంధించి 2020లో కూడా వివాదాలు తలెత్తాయి, ఆమెపై నాన్-బెయిలబుల్ ఆఫెన్స్ కింద కేసులు నమోదయ్యాయని తెలుస్తున్నాయి. అయితే కేసు విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో ఆమె పై కోర్టు సీరియస్ అయ్యింది. ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. తన కూతుర్ని కాపాడాలని మీరా మిథున్‌ తల్లి ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. మూడేళ్ళుగా పరారీలో ఉన్న మీరాను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో ఆమె ఉందని సమాచారం అందడంతో ఆమెను అదుపులోకి తీసుకొని హోమ్ కు తరలించారు పోలీసులు. ఈనెల 11న చెన్నై న్యాయస్థానంలో హజరుపరచాలని కోర్టు తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *