మూడు పెళ్లిళ్లు.. ఏడాది జైలు శిక్ష.. స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

మూడు పెళ్లిళ్లు.. ఏడాది జైలు శిక్ష.. స్టార్ హీరోయిన్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్‌లు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా


సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ల గురించి.. నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రేమ దగ్గరే ఆగిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్స్ , విడాకులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఏళ్లతరబడి ప్రేమించుకున్నవాళ్ళు.. అలాగే వివాహం చేసుకొని చాలా కాలం కలిసున్నా వారు కూడా విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత నాగ చైతన్య, జీవి ప్రకాష్, ధనుష్, రీసెంట్ గా జయం రవి విడాకులు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాగే చాలా మంది ఇద్దరు ముగ్గురిని ప్రేమించిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకప్పుడు హోటల్‌లో పని.. ఇండస్ట్రీలో తోప్.. రాజకీయాల్లో టాప్.. ఈమె ఎవరో తెలుసా.?

ఆ టాలీవుడ్ హీరోయిన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె తండ్రికి ఏకంగా 5 ఏళ్ళు అయ్యాయి. ఆమె ఎవరో తెలుసా.? నిజానికి రెండో పెళ్లి చేసుకుంటేనే పెద్ద వార్త అలాంటిది ఆ హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె ఎవరో కాదు ఆమె సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాధికా. అలాగే మెగాస్టార్ చిరంజీవి రాధికా కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు రాధికా. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదేం ట్విస్ట్ మావ..! ఈ సీనియర్ నటి చెల్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయినా..!

ఇక ఇప్పుడు తల్లి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు రాధికా శరత్ కుమార్. రాధికా శరత్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముందుగా నటుడు ప్రతాప్ పోతెన్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆతర్వాత రిచర్డ్ హార్డిని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు ఎక్కువకాలం కలిసుండలేదు. ఇక ఇప్పుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది రాధికా. ఇక శరత్ కుమార్ కు అంతకు ముందే వెళ్ళింది. రాధికను ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు రాధికా. అంతే కాదు రాధికా చెక్ బౌన్స్ కేసులో జైలుకు కూడా వెళ్లారు. రేడియన్స్ మీడియా అనే ఫైనాన్స్ సంస్థ రాధికా పై చెక్ బౌన్స్ కేసు వేసింది. 2021లో మద్రాసు కోర్టు రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉంటే తాజాగా రాధికా అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు.

పెళ్ళైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. సినిమాలకు దూరమై ఇప్పుడు ఇలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *