మునగాకు పచ్చిగా తీసుకుంటే లేదా పొడిగా వాడితే.. కేవలం పొట్ట తగ్గించడమే కాదు, మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకు పొడి తో రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద తిన్న.. లేదా ఉదయాన్నే మునగాకు నీరు తీసుకున్న ఎటువంటి పొట్ట అయినా కరిగి తగ్గాల్సిందే అంటున్నారు నిపుణులు. మునగాకు తినడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో బొజ్జకి కారణమైన టాక్సిన్స్ బయటకు పోతాయి. మునగాకులో ఉండే ధర్మోజనిక్ లక్షణాలు బాడీలో ఫ్యాట్ బర్న్‌ను వేగవంతం చేస్తాయి.
మునగాకు ఆయుర్వేదంగా శక్తివంతమైన పోషకమైన ఆహారం. వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. మునగాకులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. ఎక్కువగా ప్రొటీన్లు, ఇనుము, మెగ్నీషియం ఉండటం వల్ల మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తాయి. మునగాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
మునగాకును ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల శరీరానికి బలం, ఎముకల బలానికి దోహదపడుతుంది. మునగాకులో ఎక్కువగా ఉండే ఫైబర్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. మునగాకులో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు తరిమేస్తుంది. అంతేకాదు.. మునగలోని విటమిన్-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఉదయాన్నే మునగాకు నీరు తాగడం, దోశలలో లేదా కూరగాయలలో కలిపి వాడడం ఉత్తమం. రోజూ ఉదయాన్నే మునగాకు పొడి కలిపిన నీళ్లు లేదా మునగాకు తో చేసిన కూరలు తినడం అలవాటు చేసుకోండి. అధికంగా వాడితే లూస్ మోషన్ వచ్చే అవకాశముంటుంది. కేవలం 1 టీస్పూన్ సరిపోతుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..