గాసిప్స్ అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది గుంపులు గుంపులగా చేరి ఎక్కువగా ముచ్చట్లు పెడుతుంటారు. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు ఒక్క చోట చేరిపోయారంటే, రోజు గడస్తున్నా.. తెలియకుండా ముచ్చట్లలో మునిగిపోతారు. అయితే ఇలా ఎక్కువగా ముచ్చట్లు పెట్టడం వలన త్వరగా ముసలి వాళ్లు అయిపోతారంట. అది ఎలా అనుకుంటున్నారా? పదండి మరి దాని గురించే పూర్తిగా తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం సరైన జీవనశైలిని అవలంభించడం అంటే, మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, మన ప్రవర్త, మాట తీరు, మనం మాట్లాడే విధానం. ఇలా ప్రతీది కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటలు, దాని ధ్వని కూడా చెడు ప్రభావాలను చూపిస్తుదంట.
ముఖ్యంగా అతిగా మాట్లాడటం లేదా, ఎక్కువ సేపు గాసిప్స్ పెట్టడం వలన సమయం వృధా అవ్వడమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే మన మాటలు మానసిక ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, వంటివాటిపై కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుందంట. అందుకే మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు
ఇక కొంత మంది ఎక్కువగా ముచ్చట్లు పెడుతుంటారు. కానీ దీని వలన వృధ్యాప్యం చాలా త్వరగా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గాసిప్స్ ఇతరులకు చెప్పడం లేదా, వినడం వలన శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందంట. మీకు తెలియకుండానే మీ బాడీ ప్రతి మాటను రికార్డు చేస్తుంది.
దీంతో ప్రతి కూల విషయాలకు మీ శరీరం అనుకోని విధంగా స్పందించడం మొదలు పెడుతుంది. మీకు తెలియకుండా మీలో ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. దీని వలన త్వరగా వృధ్యాప్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ( నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదంట.)