గత వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతమైంది. అటవీ శాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను తాజాగా విడుదల చేశారు. ఈ అరుదైన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కూర్మపురం గ్రామంలో ఈ పెద్దపులిని అధికారులు విజయవంతంగా బంధించారు. పశువులపై దాడులు చేస్తూ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆందోళన కలిగించిన ఈ పులిని పట్టుకోవడం అధికారులకు సవాలుగా మారింది. బంధించిన అనంతరం, ఫిబ్రవరి 7న విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌కి తరలించి, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పులి పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక, దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు మెడకు ‘రేడియో కాలర్’ అమర్చారు. రెండు రోజుల క్రితం భారీ భద్రత నడుమ పాపికొండల అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి, అధికారులు దానిని సురక్షితంగా విడిచిపెట్టారు. బోను తలుపులు తీయగానే పులి గంభీరంగా అడవిలోకి వెళ్తున్న దృశ్యాలను ఫారెస్ట్ అధికారులు వీడియో తీసి విడుదల చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అటు అటవీ శాఖ యంత్రాంగం, ఇటు స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.. నోరు పారేసుకున్న రిపబ్లికన్ నేత
ఈ వీకెండ్‌లోనే.. ఇరాన్‌పై అమెరికా దాడులు !!
బస్సు కింద మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా ప్రాణాలను కాపాడిన స్థానికులు
మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం
Rajamouli: జక్కన్న నయా స్ట్రాటజీ.. వర్కవుట్ అవుతోందిగా