కిండిల్(2025 ఎడిషన్).. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-బుక్ లలో ఇప్పటికే పాఠకులకు బెస్ట్ ఎంపికగా ఈ కిండిల్ నిలుస్తోంది. లేటెస్ట్ 2025 ఎడిషన్ కిండిల్ ఈ-బుక్ సిగ్నేచర్ ఎలక్ట్రానిక్ ఇంక్ గ్లేర్ ఫ్రీ డిస్ ప్లే తో వస్తుంది. దీంతో సాధారణ పుస్తకాన్ని చుదువుతున్న ఫీలింగ్ వినియోగదారులకు వస్తుంది. దీనిలో మీరు ఫాంట్ సైజ్ ను కూడా మార్చుకోవచ్చు. కొత్త కిండిల్ లో 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై ఆరు వారాలు పనిచేస్తుంది.
స్మార్ట్ వాచ్.. మీ తొబుట్టువు ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టే వారైతే వారికి ఇది గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. జీపీఎస్ ట్రాకింగ్, 150 కన్నా ఎక్కు స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్లీప్ సైకిల్, స్ట్రెస్ మోనిటరింగ్, ఫీమెయిల్ హెల్త్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ప్రోకస్ వన్ ఎక్స్ వీఆర్ హెడ్ సెట్.. వర్చువల్ రియాలిటీ(వీఆర్), మెటావెర్స్ సాంకేతికతో కూడిన వస్తువులు ఇకపై ఎంటర్టైన్ మెంట్ సెక్టార్ లో రూల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ లోపే మీరు వీఆర్ సాంకేతికతతో కూడిన హెడ్ సెట్లను అనువైన బడ్జెట్లోనే కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ ఆప్టికల్ వీఆర్ గ్లాసెస్ ను స్మార్ట్ ఫోన్ ముందు కూడా పెట్టుకోవచ్చు. వీఆర్ వీడియోలు, గేమ్స్, యాప్లను ఆస్వాదించవచ్చు.
ఈకో డాట్(ఫిప్త్ జనరేషన్).. అమెజాన్ కు చెందిన ఈ స్పీకర్ కేవలం స్పీకర్ మాత్రమే కాదు. వైఫై కి కనెక్ట్ అవుతుంది. ఏసీ, ఫ్యాన్, టీవీ వంటి వాటిని దీని ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చిఆపరేట్ చేయొచ్చు. అలెక్సా అసిస్టెన్స్ ఉంటుంది. ఇది హిందీని కూడా అర్థం చేసుకుంటుంది.
ఇవే గాక సోనీ డబ్ల్యూఎఫ్-సీ700ఎన్ ఇయర్ బడ్స్, సెవెనీర్ మ్యాగ్ చార్జ్ డీ1800 3 ఇన్ 1 చార్జర్ డాక్, సిన్లింక్ స్టార్ ప్రొజెక్టర్ నైట్ లైట్, అమెజాన్ బేసిక్స్ యూఎస్బీ-సీ 7 ఇన్ 1 హబ్, వెస్టర్న్ డిజిటల్ ఎలిమెంట్స్ 1.5 టీబీ హెచ్ డీడీ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను మీ తోబుట్టువులకు బహుమతిగా ఇచ్చేందుకు పరిశీలించవచ్చు.