మార్కెట్‌ కుప్పకూలబోతుంది..! భారీ సంపద కూడబెట్టేందుకు ఇదే మంచి ఛాన్స్‌! కియోసాకి షాకింగ్‌ కామెంట్స్‌

మార్కెట్‌ కుప్పకూలబోతుంది..! భారీ సంపద కూడబెట్టేందుకు ఇదే మంచి ఛాన్స్‌! కియోసాకి షాకింగ్‌ కామెంట్స్‌


రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి మరోసారి భారీ స్టాక్ మార్కెట్ పతనం సమీపంలో ఉందని హెచ్చరించారు. ఫిబ్రవరి 17న ఎక్స్‌లో చేసిన పోస్టులో.. “గొప్ప సంక్షోభం ఇప్పుడు వస్తోంది. సిద్ధంగా ఉన్నవారికి ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపదను సృష్టించే అవకాశం ఉంటుంది. సిద్ధపడని వారికి ఇది చెత్త పీడకలగా మారుతుంది” అని పేర్కొన్నారు.

గత సంవత్సరం పొడవునా కియోసాకి పలు మార్లు మార్కెట్ పతనంపై హెచ్చరికలు జారీ చేశారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థ “ఫేక్‌ కరెన్సీ”, అధిక అప్పులు, బలహీనమైన పెన్షన్ వ్యవస్థలపై ఆధారపడి ఉన్న బుడగగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్ కుప్పకూలడం ఒక చెడు సంఘటన కాదు, సరైన వ్యూహంతో వ్యవహరిస్తే అది గొప్ప అవకాశమని ఆయన అన్నారు.

పెట్టుబడిదారులు నిజమైన ఆస్తులపై దృష్టి పెట్టాలని కియోసాకి పిలుపునిచ్చారు. తాను వ్యక్తిగతంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. బిట్‌కాయిన్‌లో కేవలం 21 మిలియన్ నాణేల పరిమితి ఉండటం వల్ల అది కొరత కలిగిన ఆస్తిగా, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా రక్షణగా పనిచేస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. భయాందోళనతో ప్రజలు అమ్మకాలుకు దిగినప్పుడు తాను మరిన్ని బిట్‌కాయిన్లు కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు. మార్కెట్ క్రాష్‌లు అంటే విలువైన ఆస్తుల అమ్మకం అని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం అనివార్యమని, కానీ దానిని సద్వినియోగం చేసుకున్నవారికి అది సంపద సృష్టించే అరుదైన అవకాశంగా మారుతుందని కియోసాకి పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *