ఇప్పటివరకు సినిమా థియేటర్లకు, ఓటీటీ కంటెంట్‌కు వేర్వేరు హీరోలుండేవారనే అభిప్రాయం ఉండేది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. మెయిన్‌స్ట్రీమ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే కొందరు పెద్ద హీరోలు వెబ్ కంటెంట్ చేస్తున్నారు కానీ, తెలుగులో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రెండు సంవత్సరాల క్రితమే నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలో ప్రవేశించారు. దీనికి దర్శకత్వం వహించిన విక్రమ్ కె కుమార్ మనం ఫేమ్ ద్వారా సుపరిచితుడు. దూత సీజన్ 2 కూడా త్వరలో రానుంది. మాస్ రాజా రవితేజ సైతం Amazon Prime Video లో తన తొలి వెబ్ సిరీస్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. దీని ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కిరణ్ అబ్బవరం, డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ కాంబినేషన్లో Amazon Prime లో మరో వెబ్ సిరీస్ రాబోతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
OTT ట్రెండింగ్‌లో ఎప్స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే
భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్ ఓటీపీ
The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు
Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్