మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో..

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా.? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో..


సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వారణాసి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. అలాగే ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు చేసిన సినిమాల్లో నాని సినిమా ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ

మహేష్ తన పాత్రలోని వేరియాక్షన్స్ ను అద్భుతంగా చూపించారు. అలాగే ఈ సినిమా చివరిలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. 2004లో విడుదలైన నాని సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అమీషాపటేల్ నటించింది. ఇక ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. నాని సినిమాలోని అన్నిపాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ సాంగ్ ఎవరు గ్రీన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు దేవయాని, రఘువరన్, సునీల్, నాజర్ , బ్రహ్మానందం ఇలా చాలా మంది నటించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో నటించిన చిన్నోడు గుర్తున్నాడా.?

ఇవి కూడా చదవండి

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

నాని సినిమాలో మహేష్ బాబు చిన్న వయసులోనే పెద్ద వాడిగా ఎదిగిపోవాలని అనుకుంటాడు. రఘువరన్ చేసిన ఓ ప్రయోగం కారణంగా అతను పెద్దవాడిగా చిన్న కుర్రాడిలా మారుతూ ఉంటాడు. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించిన చినోడు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇంతకూ అతను ఎవరో కాదు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మహేష్ మేనల్లుడు హీరో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొన్నామధ్య దేవకీ నందన వాసుదేవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కాగా అశోక్ గల్లా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు.

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *