గడప దాటాలంటే ఆడవాళ్లు భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడు.. ఎవరు.. ఏ వైపు నుంచి వచ్చి టచ్ చేస్తారోనని వణికిపోతున్నారు. మహారాష్ట్రలోని గోల్కోఠీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి శాడిస్ట్‌లను ఉపేక్షించొద్దని కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆపరేషన్ లాంగ్డా పేరుతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆకతాయిలను గుర్తించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే మురదాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించడంతో కాల్పులు జరిపాడు. ప్రతిగా పోలీసులు ఫైరింగ్ చేయడంతో యువకుడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్సనందిస్తున్నారు. అయితే విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు.
పేరు ఆదిల్.. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. ఆమెను ఫాలో అవుతాడు. వెనక నుంచి వెళ్లి గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కడెక్కడో టచ్ చేసి ఇరిటేట్ చేస్తాడు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదీ ఇతని మోడస్ ఓపెరాండీ. ఆదివారం(ఆగస్టు 3) కూడా రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరునాడు పోలీసులు కంటపడే సరికి టెన్షన్ పడ్డాడు. తప్పించుకునే క్రమంలో గాయపడి పోలీసులకు చిక్కాడు. ఆదిల్ నుంచి తుపాకీతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదిల్ ఒక్కడే ఇలా చేస్తున్నాడా? ఇంకా ఇతని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇకపై ఎవరైనా మహిళలతో పిచ్చిగా ప్రవర్తిస్తే తాటతీస్తామని హెచ్చరించారు పోలీసులు. ఈ విషయంలో ఎవ్వర్నీ ఉపేక్షించబోమని.. ఆపరేషన్ లాంగ్డా కంటిన్యూ చేస్తామన్నారు ముంబై పోలీసులు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..