మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం

మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం


దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీ ముఖలింగం ఒకటి. వంశధారా నదీ తీరాన కొలువుతీరిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని ఉన్న ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏట మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది ఆదివారం ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు బుధవారం స్వామివారి త్రిశూల చక్రతీర్థ స్నానంతో ముగిసాయి. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానం అత్యంత భక్తి శ్రద్ధలతో, భక్తజన సందోహం మధ్య ఘనంగా జరిగింది. పార్వతి, పరమేశ్వరుల ఉత్సవ మూర్తులు శ్రీముఖలింగం క్షేత్రం నుండి భారీ ఊరేగింపుగా నంది వాహనంపై వంశధార నదీ తీరానికి చేరుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఉత్సవ మూర్తులకు నదిలో త్రిశూల చక్రతీర్థ స్నానం ఆచరించారు. నదీ గర్భం మధ్యలో ఎగువన ఆది దంపతులైన ఆ పార్వతి పరమేశ్వరులు స్నానమాడగా నదిలో దిగువ భాగాన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇలా పవిత్ర స్నానాలు చేయటం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నదిలో నీరు తక్కువగా ఉండటంతో ఈ ఘట్టం కోసం ఎగువున హిరమండలం వద్ద ఉన్న గొట్టా బ్యారేజ్ నుండి నదిలోకి కొంత మేర నీటిని విడిచిపెట్టారు. ఈ పవిత్ర స్నానాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. సుమారు 2కిలోమీటర్ల మేర జనమా… జలమా అన్నట్టు నదీ తీరమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల శివనామ స్మరణతో వంశధార నదీ తీరం పులకరించింది భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి జిల్లా SP మహేశ్వర రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వంశధార నదిలో జరిగిన శ్రీ ముఖలింగేశ్వరుడి త్రిశూల చక్రతీర్థ స్నాన ఘట్టం మహా కుంభ మేళాను తలపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajamouli: జక్కన్న నయా స్ట్రాటజీ.. వర్కవుట్‌ అవుతోందిగా

వేల్పారిలో ధనుష్‌.. శంకర్‌ ప్లాన్‌ బీ సిద్ధం చేశారా ??

Anupama Parameswaran: సొంత రికార్డును అనుపమ బ్రేక్‌ చేస్తారా

సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్

మలయాళంలో సీక్వెల్స్ పై భారీ క్యూరియాసిటీ.. రెండు సూపర్ ప్రాజెక్టులపై సస్పెన్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *