కావాల్సిన పదార్థాలు : అర కిలో మటన్, 200 గ్రాములు పుట్టగొడుగులు, చిన్న ఉల్లిపాయ, టమోటాలు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, ఒక టీస్పూన్ గరం మసాలా, రుచికి ఉప్పు,
3 టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా మటన్‌ను రెండు సార్లు కడిగి శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత వాటికీ ఉప్పు, పసుపు పట్టించి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు పుట్టగొడుగులను తీసుకుని ఉప్పుతో కడిగి శుభ్రపరచుకోండి.
స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు వేసి బాగా వేయించండి. కొద్దీ సేపటి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించండి.
ఇప్పుడు మూత తీసి అన్ని రకాల మసాలా పేస్ట్ లు, టమాటాలు కూడా వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసి మూత పెట్టండి. గ్రేవీ కోసం రెండు గ్లాస్ లు నీళ్ళు పోయండి.
చివర్లో కుక్కర్ మూత తీసి, పుట్టగొడుగులను వేసి 20 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉంచండి. ఇప్పుడు దించే ముందు
కొత్తిమీర వేసి ఐదు నిముషాలు ఉంచి దించేయండి. అంతే, వేడి వేడి మష్రూమ్ మటన్ కర్రీ.




